Popular posts from this blog
మానాన్నగారంటే చదవడం...రాయడం...
మానాన్నగారు కీర్తిశేషులు శ్రీ అద్దంకికేశవరావు గారు ( జననం :8.9.1918 - మరణం: 22.11.2005) బహుభాషావేత్త , బహుముఖప్రజ్ఞాశాలి , పద్యకవి , నవలారచయిత , పాటలరచయిత , వ్యాసకర్త , స్కౌటుపుస్తకాలరచయిత , నాటకకర్త మరియు సంగీతజ్ఞుడు . ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా , జిల్లా స్కౌటాఫీసరుగా పనిచేస్తూ , ఏడుగురు సంతానాన్ని చదివిస్తూ , అనేక గ్రంథాలు చదువుతూ , స్వయంగా అనేకరచనలు చేసారు . ఎన్నివ్రాసినా ఉద్యోగంలో ఉండగా ఆయన మొదట 1967 లో ముద్రించిన అతిచిన్ని పుస్తకం 16 పేజీలతో స్కౌటు గైడు గీతములు . అంతే . 1973 లో ఉద్యోగ విరమణచేసి 1976 నవంబరు 14 న మానాయనమ్మ గారిపేరుతో శ్రీమతి అద్దంకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శినీ బాలవిహార్ అనే ఒక విద్యా సంస్ధను స్వంయంగా స్ధాపించారు . ( మా నాయనమ్మగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసినవారే .) తరువాత చాలాకాలానికి మానాన్నగారు 1987 లో ప్రీ - ప్రైమరీ పిల్లలకోసం తెలుగుబాల పేరుతో 3 పుస్తకాలు రూపొందించారు . ఆ పుస్తకాల పరిచయాన్ని టీచింగ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ ప్ర...








Comments
Post a Comment